TS: ఇంటర్‌ పరీక్షలు రద్దు: మంత్రి సబిత

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణలో ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో అధికారులతో బుధ‌వారం మంత్రి సబితా సమీక్ష నిర్వహించారు.

సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. `తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటర్ రెండో సంవత్స‌రం పరీక్షలు రద్దు చేశాం. మొద‌టి సంవ‌త్స‌రం మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తాం. ఫలితాలపై త్వరలో విధి విధానాలు రూపొందిస్తాం. విద్యార్థులెవరైనా పరీక్షలు రాయాలనుకుంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆలోచిస్తాం. ఫలితాల వెల్లడిపై త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ‌లో ఇంటర్ రెండో సంవత్స‌రం పరీక్షలుపై మంగళవారం కేబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. కేబినెట్‌ భేటీ తర్వాత దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవాళ సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.