అమిత్‌ షాతో ముగిసిన ముఖ్య‌మంత్రి జగన్‌ భేటీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎపి సిఎం వైఎస్‌ జగన్ భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం జ‌రిగిన ఈ స‌మావేశంలో గంటకు పైగా అమిత్‌ షాతో చర్చలు చేశారు సిఎం జ‌గ‌న్‌. ఎపికి సంబంధించిన పలు కీలక అంశాలపై సిఎం కేంద్ర హోంమంత్రితో చర్చించారు.

అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈరోజు సీఎం ఢిల్లీకి బ‌మ‌లుదేరిన విషయం తెలిసిన‌దే. ఈప‌ర్య‌ట‌న‌లో భాగంగా మెద‌ట‌గా కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావ్డేక‌ర్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సీఎం జగన్‌ వివరించారు. పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి ఉన్నారు.

గురువారం న్యూఢిల్లీలో కేంద్ర‌మంత్రి జావ్డేక‌ర్‌తో స‌మావేశ‌మైన ఎపి సిఎం జ‌గ‌న్‌
Leave A Reply

Your email address will not be published.