మైలార్‌దేవ్‌పల్లి: పరుపుల గోదాంలో అగ్ని ప్రమాదం..
హైదరాబాద్ (CLiC2NEWS): రాజధాని శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలోని రోషన్ కాలనీ వడ్డేపల్లిలోని ఓ పరుపుల గోదామ్‌లో మంటలు చెలరేగాయి. చిన్నగా చెలరేగిన మంటలు క్రమంగా గోదామ్ అంతటా విస్తరించాయి. ఈ ప్రమాదం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు గోదామ్ అంతాటా వ్యాపించడం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.