సిజెఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను క‌లిసిన ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాజ్‌భ‌వ‌న్‌లో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు శ‌నివారం సాయంత్రం క‌లిశారు. సీజేఐ ని ముఖ్య‌మంత్రి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

కాగా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ.. ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. ఈ మేర‌కు రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్య‌మంత్రి కెసిఆర్ కూడా యాదాద్రికి వెళ్తారు.

Leave A Reply

Your email address will not be published.