ట్రాక్టర్ ను ఢీ కొన్న కారు.. ఆరుగురు మృతి
జైపూర్ (CLiC2NEWS): రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. జోధ్‌పూర్‌లోని డంగియావస్ సమీపంలో ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లింది ఓ కారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ప్రమాదంలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అజ్మీర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.