India Corona: 40 వేల దిగువకు కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 39,796 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229కి చేరింది.
- తాజాగా 42,352 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 2,97,00,430 మంది బాధితులు కోలుకున్నారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో 723 మంది కొత్తగా మృతిచెందారు. ఇప్పటి వరకు దేశంలో
- 4,02,728 మంది రోగులు మహమ్మారి వల్ల మరణించారు.
- మొత్తం కేసుల్లో 4,82,071 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
- ఇప్పటివరకు దేశంలో 35,28,92,046 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.