`డెల్టా`తో జాగ్రత్త: అమెరికా అధ్యక్షుడు బైడెన్
వాషింగ్టన్ (CLiC2NEWS): కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే దాదాపుగా 30 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ మరణాల్లో అత్యధికంగా అమెరికాలోనే నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. అమెరికా 245 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ అధ్యక్షుడు జో బైడెన మాట్లాడుతూ..
కరోనా తీవ్రత నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ప్రస్తుతానికి తాత్కాలికంగా మాత్రమే పై చేయి సాధించామని జోబైడెన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో తప్పని సరిగా కోవిడ్‌పై విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్లు ప్రపంచాన్ని భయపెడుతున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని జో బైడెన్ పేర్కొన్నారు.