నో పవర్ కట్స్, 300 యూనిట్ల వరకూ కరెంట్ ఫ్రీ: కేజ్రీవాల్
న్యూఢిల్లీ (CLiC2NEWS): పంజాబ్ రాష్ట్రంతో త్వరలోనే జరుగనున్న ఎన్నికల్లో ఆప్ తన తన ముద్రను వేసుకోవాలని చూస్తోన్నట్టుంది. ఈ ఎన్నికలలో ఓటర్లు ఆకట్టుకునేందులో భాగంగానే ఉచిత విద్యుత్ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. గతంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించిన ఆప్, ఇప్పుడు దానికి మరో వంద యూనిట్లు పెంచింది. 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌తో పాటుగా ఉత్తరాఖండ్‌పై కూడా ఆప్ కన్నేసింది. ఈ మేరకు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఉత్తరాఖండ్‌లో కూడా పర్యటించారు.
“ఉత్తరాఖండ్ రైతులకు ఉచితంగా విద్యుత్‌నిస్తాం. పేద రైతులపై విద్యుత్ భారం మోపుతున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే, ఆ డబ్బుల ద్వారా వారి వారి పిల్లల్ని చదివించుకుంటారు. వారి కుటుంబాలు బాగుపడతాయి. కరెంట్ బిల్లుల విషయంలో అవినీతి జరగడం, తప్పుడు బిల్లులను సృష్టించడం చూస్తూనే ఉన్నాం“ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
పంజాబ్‌లో ప్రకటించిన విధంగానే ఉత్తరాఖండ్ లో కూడా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. అదే విధంగా, పాత బిల్లుల బకాయిలను కూడా మాఫీ చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు అధికారంలోకి వస్తే ఉత్తరాఖండ్‌లో రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు.