దారుణం: అట్టపెట్టలో న‌వ‌జాత శిశువు!

కాకినాడ‌ (CLiC2NEWS): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం వెలుగు చూసింది. ఓ నెలల బిడ్డను శ్మశానంలో వ‌దిలి వెళ్లారు. గుక్కపెట్టి ఏడుస్తున్నాడు.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ నవజాత శిశువును కాటికాపరి అట్ట‌పెట్టెలో గుర్తించాడు.

స్థానికులు తెలిపిన స‌మాచారం మేర‌కు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్మశాన వాటికలో శనివారం అర్ధరాత్రి నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అట్టపెట్టెలో ఉంచి వెళ్లిపోయారు. పసిబిడ్డ ఏడుపును విన్న కాటికాపరి శివ అట్టపెట్టెలో ఉన్న మగశిశువును గుర్తించి, స్థానికులైన వెంకటేష్‌ దంపతులకు అప్పగించాడు. ఆ దంతులు వెంటనే రాజమహేంద్రవరంలోని చిన్న పిల్లల ప్రత్యేక సంరక్షణ యూనిట్‌కు తీసుకెళ్లారు. శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో 108 సిబ్బంది శిశువుకు అత్యవసర వైద్యాన్ని అందిస్తూ కాకినాడ ఎన్‌ఐసీయూ (నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)కు తరలించారు.

ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, శిశువు బరువు సుమారు 750 గ్రాములున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ జీవీ సత్యవాణి తెలిపారు. బాబు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులకు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు శిశువు అసలు తల్లిదండ్రుల కోసం ఆరా తీస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.