కొవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం: 52 మంది మృతి
ఇరాక్ (CLiC2NEWS): ఇరాక్‌లోని నస్రియా అల్ – హుస్సేన్ కొవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కరోనా వార్డులో చికిత్స పొందుతున్న 52 మంది రోగులు మృతి చెందారు. మరో 13 మంది రోగులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం.

అయితే ఆక్సిజన్ ట్యాంకర్స్ పేలడం వల్ల మంటలు వార్డుకు వ్యాపించినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపారు. ఈ కరోనా వార్డు 70 పడకలతో 3 నెలల క్రితం ప్రారంభమైంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.గాయపడ్డ రోగులను సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ ఘటనపై ఇరాక్ ప్రధానమంత్రి ముస్తాఫా ఆల్ కాధేమీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మినిస్టర్స్‌తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు.
Latest on #IRAQ hospital fire. Death toll reaches at least 39, including 2 medical staff & security guard, after a fire broke out in the COVID isolation ward at Al-Hussein hospital in Nasiriya, southern Iraq. pic.twitter.com/0R4YgvKiWl
— Arwa Ibrahim (@arwaib) July 12, 2021