లోయలో పడిన బస్సు.. 24 మంది మృతి
బొలీవియా (CLiC2NEWS): బొలీవియాలోని చాటక్విలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్రంగా గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద విషయం తెలసుకున్న అధికారులు, సహాయక సిబ్బంది బస్సును వెలికితీసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వరకు ప్రయాణికులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
