హిమాచల్‌ప్రదేశ్‌లో వరదల్లో 9 మంది మృతి
సిమ్లా(CLiC2NEWS): హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలతో గత రెండు రోజుల వ్యవధిలో వచ్చిన వరదల వల్ల 9 మంది మరణించారు. ఈ వరదల్లో మరో 8 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని 142 రోడ్లు కొట్టుకుపోయాయని రెవెన్యూశాఖ వెల్లడించింది. వరదలపై అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కులూ జిల్లాలో వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీచేసిందనిఅదనపు డిప్యూటీ కమిషనర్ ప్రకాశ్ సింగ్ తెలిపారు.
