జమ్ముకశ్మీర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హ‌తం

పుల్వామా (CLiC2NEWS): జమ్ముకశ్మీర్​లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జ‌రిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు సహా పాకిస్థాన్​కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా హతమైనట్లు అధికారులు వెల్లడించారు.

భద్రత ద‌ళాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్ర‌వాదులు ఉన్న‌ఫ‌లంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత దళాలు జ‌రిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్క‌రులు మ‌ర‌ణించారు. ఇంకా పుల్వామాలో కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.