గర్జించిన గబ్బర్ సేన
తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం..
కొలంబో (CLiC2NEWS): శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విషయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్ధేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని గబ్బర్ సేన మూడు వికెట్లు కోల్పయి 36.4 ఓవర్లలో ఛేదించింది. శిఖర్ దావన్ 95 బంతుల్లో 86 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికిగాను 262 పరుగులు చేసింది. చివర్లో కరుణరత్నె(43 నాటౌట్) ధాటిగా ఆడడంతో శ్రీలంక జట్టు స్కోరు పెరిగింది.
ఓపెనర్ పృథ్వీ షా 24 బంతుల్లో 43 పరుగులు సాదించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. కెప్టెన్ శిఖర్ దావణ్ (85), సూర్యకుమార్ (31) చివరి వరకు క్రీజులో నిలిచి తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. యంగ్ ప్లేయర్స్ సమిష్టిగా రాణించడంతో భారత్ లక్ష్యాన్ని 36.4 ఓవర్లలోనే పూర్తి చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది టీం ఇండియా.
A comprehensive 7-wicket win for #TeamIndia to take 1-0 lead in the series🙌
How good were these two in the chase! 👏👏
8⃣6⃣* runs for captain @SDhawan25 👊
5⃣9⃣ runs for @ishankishan51 on ODI debut 💪Scorecard 👉 https://t.co/rf0sHqdzSK #SLvIND pic.twitter.com/BmAV4UiXjZ
— BCCI (@BCCI) July 18, 2021