పార్లమెంట్‌కు సైకిళ్లపై టీఎంసీ ఎంపీలు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో చమురు ధరలు సెంచరీ దాటేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రో, ఢీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ (సోమవారం) పార్లమెంట్‌కు సైకిల్‌పై వచ్చారు. ఈ మధ్యకాలంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. పలు రాష్ట్రాల్లో లీటర పెట్రోల్ ధర వంద రూపాయాలు దాటింది. న్యూఢిల్లీలోని 61 సౌత్ అవెన్యూ నుంచి తృణమూల్ ఎంపీలు సైకిల్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. నూతన రైతుల చట్టాలపై చర్చ చేపట్టాలని ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.
