TS: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాలు పెంపు
హైదరాబాద్ (CLiC2NEWS): జూనియర్ పంచాయతీ కార్యదర్శు (జేపీఎస్)లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన నెలసరి వేతనాన్ని రూ.15వేల నుంచి రూ.28,719కి పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1వ తేదీ నుంచి పెరిగిన వేతనాలు అమలులోకి రానున్నాయి.
అలాగే ప్రొబేషన్ పీరియడ్ మూడు నుంచి నాలుగేళ్లకు పెంచింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను పోస్టులను ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రొబేషన్ పీరియడ్‌ను రెండేళ్లుగా ఖరారు చేసి రూ.15 వేల వేతనాన్ని నిర్ణయించిన విషయం తెలిసిందే.