India Corona: కొత్తగా 30,093 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,74,322కు పెరిగింది.
- ఇప్పటి వరకు 3,03,53,710 మంది డిశ్చార్జి అయ్యారు.
- మరో వైపు కొత్తగా 45,254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
- వైరస్ బారినపడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4,14,482 మంది బాధితులు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం
- దేశంలో 4,06,130 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
- ఇప్పటి వరకు 41,18,46,401 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.