ఐపిఎస్ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తుచేశారు. త‌న నిర్ణ‌యాన్ని సోమ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి మెయిల్ ద్వారా తెలిపారు. ప్ర‌జ‌ల పేరుతో రాసిన బ‌హిరంగ లేఖలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 26 ఏండ్ల సర్వీస్‌ పూర్తిచేసిన ఈ ఐపీఎస్‌ అధికారి ప్రస్తుతం అడిషనల్‌ డీజీ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

తనపై నమ్మకంతో పలు బాధ్యతలు అప్పగించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పదవీవిరమణ త ర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు, బీఆర్‌ అంబేద్కర్‌, కాన్షీరాం మార్గంలో పేదలకు అండగా ఉంటానని పేర్కొన్నారు.

రాజ‌కీయాల్లోకి ఇప్పుడే కాదు..
రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని.. అయితే ఎప్పుడ‌నేది ఇంకానిర్ణ‌యం తీసుకోలేద‌ని ప్ర‌వీణ్ కుమార్ ఒక మీడియా సంస్థ‌కు తెలిపారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం తనకు లేదని ప్రవీణ్‌కుమార్‌ స్పష్టంచేశారు.

Leave A Reply

Your email address will not be published.