యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి లక్ష పుష్పార్చన
భువనగిరి(CLiC2NEWS) : తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈరోజు సర్వేశ ఏకాదశి (తొలి ఏకాదశి) పర్వదినం పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో, వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామికి లక్ష పుష్పాలతో అర్చనలు జరపడం ఆలయ సంప్రదాయం. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలతోపాటు ప్రత్యేక సుదర్శన నారసింహహోమం నిర్వహించారు.