TS: రెండో విడ‌త గొర్రెల పంపిణీకి రూ.6వేల కోట్లు

హైద‌రాబాద్‌(CLiC2NEWS): రాష్ట్రంలో రెండో విడ‌త గొర్రెల పంపిణీ విష‌యంపై ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.  మొద‌టి విడ‌త‌లో రూ.5వేల కోట్ల‌తో గొర్రెల పంపిణీ చేయ‌గా, రెండో విడ‌త గొర్రెల పంపిణీకి రూ.6వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నిధుల‌ను త్వ‌ర‌లోనే స‌మ‌కూర్చాల‌ని సీఎం ఆర్ధిక‌శాఖ‌ను ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రామీణ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో అత్యంత కీల‌క‌మైన‌ కుల వృత్తుల‌ను ‌ప్రోత్సహిస్తుంద‌ని, వాటి పురోగ‌తికి నిర్విరామంగా కృషి చేస్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్ర‌లు హ‌రీష్‌రావు, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.