AP: బీసీ, ఈబీసీల‌కు 5,600 మినీ ట్ర‌క్కులు

స‌బ్సిడీ 30శాతం నుంచి 60 శాతానికి సబ్సిడీ

అమరావతి (CLiC2NEWS): ఆంధప్ర‌దేశ్‌ రాష్ట్రంలో బీసీలకు 3,800 మినీ ట్రక్కులు, ఈబీసీలకు 1,800 మినీ ట్రక్కులు.. మొత్తం 5,600 మినీ ట్రక్కులను సబ్సిడీపై ప్రభుత్వం అందజేయనుంది. వెనుకబడిన తరగతులు (బీసీ), ఆర్థికంగా వెనుకబడిన వారి (ఈబీసీ) అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ)లను మంజూరు చేసింది. బీసీలు, ఈబీసీల సంక్షేమం, స్వయం ఉపాధి పథకం మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేశారు.

మొత్తం యూనిట్‌ (మినీ ట్రక్కు) వ్యయంలో 10% లబ్ధిదారుడు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 90 శాతాన్ని ఎంపిక చేసిన బ్యాంకు నుంచి రుణంగా అందిస్తారు. 90 %  అప్పులో లబ్ధిదారుడు 60 % సబ్సిడీగా పోనూ మిగిలిన 30 శాతాన్ని 72 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లించాలి. ఇప్పటి వరకు లబ్ధిదారుడికి ఇస్తున్న 30 శాతం సబ్సిడీని 60 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.