TS: ఏడేళ్లలో రూ. 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి కెటిఆర్
కొత్తూరు (రంగారెడ్డి) CLiC2NEWS : తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో వేగంగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. 2015 నుంచి ఇప్పటి వరకు టీఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణకు రూ. 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని మేకగూడలో పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ కంపెనీని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఉపాధి కల్పనలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ లాంటి విప్లవాత్మక సంస్కరణలెన్నో చేపట్టామని మంత్రి తెలిపారు.
రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టని టీఎస్ ఐపాస్ చాలా బాగా ఉందని పోకర్ణ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ చంద్ పేర్కొన్నారు. మంత్రి కెటిఆర్ చొరవతోనే మార్బుల్ పరిశ్రమను మేకగూడలో ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు
Ministers @KTRTRS, @SabithaindraTRS and @DayakarRao2019 formally inaugurated the state of the art Pokarna Engineered Stone Ltd – Quantra Quartz manufacturing facility in Mekaguda village of Ranga Reddy Dist. pic.twitter.com/y1Nnj9WLAF
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 31, 2021