Olympics: సెమీస్ లో సింధు ఓట‌మి..

కాంస్య ప‌త‌కానికి మ‌రో అవ‌కాశం

టోక్యో (CLiC2NEWS): ఒలింపిక్స్‌ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో జ‌రిగిన సెమీఫైన‌ల్స్‌లో భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు ఓట‌మి పాలైంది. ప్రపంచ నంబర్‌-1 చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌తో హోరాహోరీగా సాగిన పోరులో 18-21, 12-21 తేడాతో సింధు ఓటమి చవి చూసింది. మ్యాచ్ ప్రారంభంలో కాస్త ఆధిప‌త్యం చెలాయించిన సింధు తొలి విరామం త‌ర్వాత వెనుక‌ప‌డింది. ఈ క్ర‌మంలోనే అనూహ్యంగా పుంజుకున్న తైజు త‌ర్వాత సింధూకు గట్టి పోటీని ఇచ్చింది దాంతో తొలి గేమ్‌లో సింధు పరాజ‌యం పాలైంది.

రెండో గేమ్‌లో సింధుపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన తై జు యింగ్‌ 21-12తో ఈ గేమ్‌ నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా ఈ మ్యాచ్‌లో ఓట‌మిపాలైన సింధూకు ప‌త‌కం సాధించేందుకు మ‌రో అవ‌కాశం ఉంది. మ‌రో సెమీ ఫైన‌ల్‌లో ఓట‌మిపాలైన చైనా క్రీడాకారిణి హి బింగ్ జియావోతో ఆదివారం సాయంత్రం త‌ల‌ప‌డ‌నుంది. అక్క‌డ గెలిస్తే కాంస్యం సాధించే అవ‌కాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.