ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు నా స్వప్నం: జస్టిస్ ఎన్.వి. రమణ
ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన అందరికి ధన్యవాదాలు
హైదరాబాద్ (CLiC2NEWS): అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందపి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు సిజే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ..
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ చొరవ చూపిందని తెలిపారు. పెట్టుబడిదారులు వివాదాలు లేని వాతావరణం కోరుకుంటారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 1926లో తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం మొదలైందని తెలిపారు. దుబాయ్‌లోనూ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైందన్నారు.
ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సి వస్తోందని.. ఆర్బిట్రేషన్ కేంద్రం వల్ల కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు.
ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు వస్తారని చెప్పారు. మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి తెలంగాణ సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్బిట్రేషన్ ఏర్పాటు బాధ్యత జస్టిస్ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ సుభాష్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.
I think the admin of this website is genuinely working hard for his
web site, because here every data is quality based stuff.
my website jasa desain company profile (Rosemary)