కడప, వైజాగ్‌లలో ఉద్యోగాలు..

కడప జిల్లా అంగన్‌వాడీల్లో 288 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం.. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 288

  • పోస్టుల వివరాలు:
    అంగన్‌వాడీ కార్యకర్తలు–50
    అంగన్‌వాడీ సహాయకురాలు–225
    మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు–13
  • అర్హత:
    అంగన్‌ వాడీ కార్యకర్త పోస్టులకు పదో తరగతి
    అంగన్‌వాడీ సహాయకురాలు, మినీ అంగన్‌ వాడీ కార్యకర్త పోస్టులకు ఏడో ఉత్తీర్ణత ఉండాలి.
    స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి.
  • వయసు:
    01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం:
    అర్హత ప్రమాణాలు, ఓరల్‌ ఇంట ర్వ్యూ, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
  • దరఖాస్తు విధానం:
    ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
    దరఖాస్తును స్త్రీశిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపించాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021
  • వెబ్‌సైట్‌: kadapa.ap.gov.in

డబ్ల్యూడీసీడబ్ల్యూ, విశాఖపట్నంలో 12 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12

  • పోస్టుల వివరాలు:
    డేటా ఎంట్రీ ఆపరేటర్‌–07
    కంప్యూటర్‌ ఆపరేటర్‌–05
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ పని చేయాల్సిన ప్రాంతాలు:
    కొయ్యూరు, ముంచంగిపుట్, పాడేరు, పెదబయలు,డుంబ్రీగూడ,అనకాపల్లి, రావికమతం.
  • కంప్యూటర్‌ ఆపరేటర్‌ పని చేయాల్సిన ప్రాంతాలు:
    భీమునిపట్నం, నర్సీపట్నం,పెందుర్తి, నక్కపల్లి, ఎలమంచిలి.
  • అర్హత:
    ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.
  • వయసు:
    01.07.2021 నాటికి 21 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
  • వేతనం:
    నెలకు రూ.15,000 వరకు చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం:
    కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
  • దరఖాస్తు విధానం:
    ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021
  • వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in
Leave A Reply

Your email address will not be published.