క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం..

నిజామాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ శాస‌న‌స‌భాప‌తి పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి బుధవారం తన స్వగ్రామం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామం వెళ్లారు. అక్క‌డి నుండి తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో స్పీకర్‌కి మార్గమధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించారు. వెంట‌నే కారు దిగి ఇలా బ్యాటు అందుకున్నారు స్పీక‌ర్ పోచారం. పిల్ల‌ల‌తో క‌లిసి కాసేపు స‌ర‌దాగా క్రికెట్ ఆడారు. పిల్లలు బౌలింగ్ చేయ‌గా స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస‌ర‌రెడ్డి బ్యాటింగ్ చేసి పిల్ల‌ల్లో హుషారు నింపారు. శాస‌న‌స‌భ స్పీక‌ర్ స్వ‌యంగా వారితో క్రికెట్ ఆడ‌టం ప‌ట్ల పిల్ల‌లు ఆనందం వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.