శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నిజామాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువ గోదావరిలోకి 22,720 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతోందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. ఇవాళ (సోమవారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు వరద ఉధృతి పెరగడంతో 20 వరద గేట్లను ఎత్తి 74,880 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశామని పేర్కొన్నారు.
సాయంత్రానికి ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో 5 గంటలకు 14 గేట్లను మూసివేసి 6 గేట్లతో 18,720 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లతో గోదావరిలోకి 4 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు
- సోమవారం సాయంత్రానికి 1090.90 అడుగుల నీటి నిల్వ ఉంది
- ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఈ సీజన్లో 292.116 టీఎంసీల వరద వచ్చింది.
- కాలువలు, గోదావరిలోకి 220 టీఎంసీల మిగుల జలాలను వదిలినట్లు అధికారులు తెలిపారు.