విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి
ములకలపల్లి (CLiC2NEWS): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు గిరిజన వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ములకలపల్లి మండలం మాదారం అటవీప్రాంతంలో ఇవాళ (మంగళవారం) ఉదయం చోటు చేసుకుంది. అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలపై గిరిజనులు కూలీ పనులకు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు కాలు మోపారు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై ఆ ఇద్దరు మరణించారు.
మృతులను మొగరాలకుప్పకు చెందిన పాయం జాన్‌బాబు (24), కూరం దుర్గారావు(35)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.