100 పడకల ఆస్పత్రికి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన
జోగులాంబ గద్వాల (CLiC2NEWS): జిల్లాలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ పర్యటన ప్రారంభమైంది. జిల్లాలోని అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డు ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు.
మంత్రి కెటిఆర్ ఇవాళ (మంగళవారం) కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రి మరికాసేపట్లో జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత గద్వాల మండలం గోన్పాడ్ వద్ద షాదీఖాన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. సంగాల పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా గ్రంథాలయ భవనం, జూనియర్ కళాశాల కోసం భనవ నిర్మాణానికి శంకుస్థాపన, డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులకు, ఆడిటోరియం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు భూమి పూజ చేసిన అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు.
ఈ కార్యక్రమంలో కెటిఆర్ తో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అబ్రహం, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో పాటు తదితరులు పాల్గొన్నారు.