కామాంధుడిని పట్టిస్తే రూ.10 లక్షలు..

హైదరాబాద్‌ పోలీసుల సంచలన ప్రకటన!

హైదరాబాద్‌ (CLiC2NEWS): సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల‌ బాలికపై హ‌త్యాచార ఘ‌ట‌న‌లో నిందితుడికోసం ముమ్మ‌రంగా గాలిస్తున్న పోలీసులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నిందితుడిని పట్టిస్తే రూ. ప‌ది లక్షలు రివార్డు ఇస్తామ‌ని ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు ఈస్ట్‌ జోన్‌ డీసీపీ 94906 16366, టాస్క్‌ ఫోర్స్‌ 94906 16627 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లను తెలుపుతూ పోలీసులు రివార్డు ప్రకటించారు. కాగా ఈ మ‌ధ్య కాలంలో హైద‌రాబాద్ పోలీసులు ఇంత మొత్తంలో రివార్డు ప్ర‌క‌టించిన దాఖ‌లాలు లేవు.

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసులో పోలీసులు 10 బృందాలుగా ఏర్ప‌డి గ‌త నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నాయి. అయినా నిందితుడు రాజు ఆచూకి తెలియ‌లేదు. ఈ నేప‌థ్యంలో నిందితుడికి సంబంధించిన కొన్న ఆన‌వాళ్లు చూపుతూ పోలీసులు రివార్డు ప్ర‌క‌టించారు.

నిందితుడి వయసు 30 సంవత్సరాలని, ఎత్తు 5.9 అడుగులు ఉంటాడని, మెడలో భుజాలపై రెడ్‌ కలర్‌ స్కార్ఫ్‌ వేసి ఉంటుందని, రెండు చేతులపై మౌనిక అని టాటూ ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.