సంధి వాతం..
సంధివాతం.. (అస్టియోఅర్ధరైటీస్ ) వయసు పెరుగుతున్న కొద్ది కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. కానీ ఈ సమస్య స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. కొందరికి వయసుతో సంబంధం లేకుండా కూడా ఈ లక్షణాలు కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం దీనికి కొద్దిగా విరుద్ధంగానే వుంది. తినే ఆహారంలో చక్కని పోషక పదార్ధాలు అందకపోవటం, ప్రకృతికి విరుద్ధంగా ఆహారం తీసుకోవటం, సరైన వ్యాయామం లేకపోవటం, అధిక వ్యాయామం చేయటం, మోకాళ్ళ కీళ్ళు, తుంటి కీళ్ళు, నడుము కీళ్ళు దగ్గర మెడ దగ్గర కీళ్ళు దగ్గర నొప్పులు రావటం జరుగుతుంది. ముఖ్య కారణం కీళ్లలో వున్న కార్టీలేజ్ దెబ్బతినటం వలన ఎముకలు గరుకుగా మారటం ఎముకల మధ్య ఖాళీ ప్రదేశంలో లేకపోవటం, కదిలినపుడు ఎముకలు గరగర గా అనటం జరుగుతుంది. ఎముకల దగ్గర వున్న కండరాల లిగమెంట్స్ బిగసుకుంటాయి.కీళ్ళు పరస్పరం రాసుకుంటాయి. నొప్పులు వస్తాయి. వాపులు వస్తాయి. జాయింట్లు పెళలుసు మారి విరిగిపోతాయి. దీనినే సంధివాతం అంటారు. భారతదేశంలో ఏటా పది కోట్ల మందికి పైగా ఈ జబ్బుతో బాధపడుతున్నారు.
లక్షణాలు.
1. కీళ్ళు బాగా నొప్పి రావటం.
2. పట్టుపట్టటం.
3.రక్తనాళాలు, కండరాలు బలహీనంగా మారటం.
4.కీళ్ళ వాపు, కీళ్ళు వంకర టీంకరగా మారటం,
5.నడవటం, మెట్లు ఎక్కటం ఇబ్బందిగా ఉండటం.
6.కాళ్ళు చాచాలన్న,మడవ లన్న, చాలా ఇబ్బంది పడటం,
7.నొప్పితో కీళ్లలో నీరు చేరటం జరుగుతుంది.
8. దూరంగా నడిచినపుడు గర గర శబ్దం రావటం జరుగుతుంది.

జీవన శైలిలో మార్పు చేసుకోవటం
1. ప్రతిరోజు కొద్ది దూరం నడక అవసరం.
2. అప్పడప్పుడు సంధివాతాన్ని నివారించుకోవచ్చును.
3. ఎక్కువసేపు కూర్చోవటం వలన నొప్పి ఎక్కువగా మారుతుంది.కనుక క్రియశిలకమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.
4.బరువులు ఎత్తేటపుడు శరీర స్థితి, చూసుకొని ఎత్తాలి.
5. తిరిగినపుడు, లేచినపుడు, కూర్చున్నపుడు సరిచేసుకొని నడవాలి.
6.మానసిక ఒత్తిడిని పెచ్చుకోవద్దు. సమయానికి తిని పడుకోవాలి..
పథ్య.. ఆపథ్య ఆహారం.
1.ఈ రోగంలో భోజనానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది.
2. దీని కొరకు సంతులిత ఆహారం మరియు నిషిద్ధ ఆహారం నియమాలు పాటించాలి.
3. ఆహారం c విటమిన్ తో కూడుకున్నవి, కివి, ఊసిరి ఎక్కువగా తీసుకువాలి.
4. కాల్షియం తో కూడకున్న డైరీ పాల ఉత్పత్తులు తీసుకోవాలి.
5.బీటా కేరొటీన్ వున్న బొప్పాయి,క్యారెట్, పాలకూర ఆహారం తీసుకోవాలి.
6. భోజనంలో పీచు పదార్ధములు వున్న కాయగూరలు ఎక్కువగా తినటం మంచిది.
7. అల్లం, పసుపు ఎక్కువగా ఆహారంలో వాడితే అర్ధ రైటీస్ తగ్గించుకువచ్చును.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
1.హైట్ ని బట్టి మీ యొక్క శరీర బరువు ఉండేటట్లు చూసుకోండి.
2.ప్రతిరోజు, నడక, యోగ, ప్రాణాయామము, ఏదో ఒక వ్యాయామం చేయాలి. అధిక వ్యాయామం మంచిది కాదు.
3.కీళ్ళ మీద ఎక్కువగా భారం వేయటం వలన నొప్పులు వస్తాయి. వాటి మీద భారం పడకుండా చూసుకోండి
4.నొప్పి వున్న చోట వేడి కాపటం చేయండి..
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు.