కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం
కొమురవెల్లి (CLiC2NEWS): కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం పోటెత్తిన భక్తులు. సెలవు దినం ఆదివారం దాదాపు 15 వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
నిన్న(శనివారం) సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్నభక్తులు ఇవాళ స్వామి వారిని దర్శించుకొని, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులను చెల్లించుకున్నారు.