మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మాతృవియోగం

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. శుక్రవారం రాత్రిహైదరాబాద్‌లో గుండెపోటు రావడంతో ఆమె మరణించారు.
శాంతమ్మ అంత్యక్రియలు మహబూబ్ నగర్ పట్టణంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో శనివారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్‌ ఇదే ఏడాది ఫిబ్రవరి 14న మరణించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.