పునీత్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ
బెంగళూరు (CLiC2NEWS): శాండల్‌వుడ్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. అతిచిన్న వయసులో ఈయన శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ కుప్పకూలి పడిపోయారు. వెంటనే ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసియూకి తరలించి చికిత్స అందిస్తుండగా పునీత్ తుది శ్వాస విడిచారు. పునీత్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.
పునీత్ మృతి పట్ల శాండల్‌వుడ్ ప్రముఖలే కాక టాలీవుడ్,బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
46 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయిన పునీత్ రాజ్ కుమార్ తీరని బాధని మిగిల్చాడు. ఆయన పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తీసుకెళ్లారు. పునీత్ భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులు అర్పించడానికి బెంగుళూరు బయలుదేరారు. తాజాగా బాలకృష్ణ పునీత్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు.
కాగా కంఠీరవ స్టేడియానికి మెగాస్టార్ చిరంజీవి ఇవాళ సాయంత్రం చేరుకోనున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ప్రముఖులు కూడా వెళ్లనున్నట్టు తెలిసింది.