India Corona: కొత్తగా 10,853 కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కూడా కరోనా కేసుల నమోదు 11 వేలకు దిగువనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 10,853 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 3,43,55,536కు పెరిగాయి.
- ఇప్పటి వరకు దేశంలో 3,37,49,900 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4,60,791 మంది బాధితులు మరణించారు.
- ప్రస్తుతం దేశంలో 1,44,845 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- గత 24 గంటల్లో కొత్తగా 12,432 మంది కోలుకున్నారు.
- గత 24 గంటల్లో కొత్తగా 526 మంది మరణించారని ఆరోగ్యశాఖ తెలిపింది.
- దేశంలో ఇప్పటివరకు 1,08,21,66,365 కరోనా డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది.