కొండత పెంచి పిసరంత తగ్గించారు: సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): దేశ ప్ర‌జ‌ల‌కు ఆహార కొర‌త రాకుండా చూసుకొనే బాధ్య‌త‌ను రాజ్యాంగం కేంద్ర స‌ర్కార్‌పై పెట్టింద‌ని.. ప్ర‌స్తుతం కేంద్ర స‌ర్కార్ త‌న బాధ్య‌ను విస్మ‌రిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్ర స‌ర్కార్ రోజుకోమాట చెబుతోంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆదివారం కెసిఆర్ పంట‌ల సాగు, పెట్రో ద‌ర‌ల‌పై మాట్లాడారు..

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై ముఖ్య‌మంత్రి కెసిఆర్ ​ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్​ స్థాయి మీరి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్​ ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుని స్థాయిలో ఉండి.. అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్‌ ఎవరి మెడలు వంచుతారో చెప్పాలని నిలదీశారు. ధాన్యం కొనేది లేదని చెప్పిన కేంద్రం మెడలు వంచుతారా? అనే స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. అడ్డందిడ్డం మాట్లాడేవారి మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సీఎం కేసీఆర్​ సూచించారు. మెడలు వంచటం కాదు.. ఇరుస్తాం..అని కెసిఆర్ స్ప‌ష్టం చేశారు.
“కెసిఆర్‌ను జైల్లో పెడ‌తామ‌ని బండి సంజ‌య్ అంటున్నారు.. కెసిఆర్‌ను జైలుకు పంపే ద‌మ్ము బిజెపి నేత‌కు ఉందా? క‌ఎసిఆర్‌ని ట‌చ్ చేసి చూడు.. బ‌తికి బ‌ట్ట‌క‌డ‌తావా? మ‌ఈరు ధ‌ర్నాలు చేయ‌డం కాదు.. రేప‌ట్నంచి మేం ధ‌ర్నాలు చేస్తాం.. ఉత్త‌ర భార‌త రైతుల‌కు మ‌ద్ద‌తుగా ధ‌ర్నా చేస్తాం.. సాగు చ‌ట్టాను ర‌ద్దు చేయాల‌ని ఆందోళ‌న చేస్తాం..కేంద్రంపై పోరాడుతున్న రైతుల‌కు అండ‌గా ఉంటాం.. ఉత్త‌ర భార‌త రైతుల‌కు మ‌ద్ద‌తుగా ధ‌ర్నాలు చేస్తాం ఢిల్లీ బిజెపి వ‌రి వేయొద్ద‌ని ఆంటోంది.. ఇక్క‌డి సిల్లీ బిజెపి వ‌రి వేయాల‌ని చెప్తొంది.. కేంద్రం వ‌రిధాన్యం కొంటుంటే నేను వ‌ద్ద‌న్నానా? వ‌రి కొంటామంటూ కేంద్రం నుంచి బిజెపి నేత‌లు లేఖ తేవాలి. వానాకాలం ధాన్యం మొత్తం కొనే వ‌ర‌కు బిజెపిని నిద్ర‌పోనివ్వంను“ అని కెసిఆర్ స్ప‌ష్టం చేశారు.

పెట్రోల్ ధ‌ర‌లు పెంచిన వాళ్లే త‌గ్గించాలి… కెసిఆర్‌
2014లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు క్రూడ్ ఆయిల్ ధ‌ర ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో 105.52 డాల‌ర్లుగా ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధ‌ర 83 డాల‌ర్లుగా ఉంది. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు క్రూడ్ ఆయిల్ ధ‌ర 105 డాల‌ర్ల‌ను దాట‌లేదు. ఆయిల్ ధ‌ర క్రాష్ అయి చాలా సార్లు త‌గ్గాయి కానీ.. ఏనాడూ పెర‌గ‌లేదు. అయితే.. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు పెరిగాయి అని కేంద్రం అబ‌ద్ధం చెప్పి ధ‌ర‌లు పెంచుతూ పోయింది. పెంచే ప‌ద్ధ‌తి కూడా అడ్డ‌దిడ్డంగా ఉంది. దాంట్లో సుంకం పెంచ‌కుండా సెస్ రూపంలోకి మార్చి ధ‌ర‌లు పెంచారు. రాష్ట్రాల వాట ఎగ్గొడుతూ.. రాష్ట్రాల‌ నోరుకొడుతున్నారు. రాష్ట్రాల‌కు వాటా ఇవ్వాల‌ని సెస్ కింద మార్చి ల‌క్ష‌ల కోట్లు ఎగ్గొడుతున్నారు.

మొన్న జ‌రిగిన ఉపఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకించ‌డంతో.. కొండంత పెంచి.. పిస‌రంత ధ‌ర‌ల‌ను త‌గ్గించి ఏదో గొప్ప ప‌ని చేసిన‌ట్లు చెప్పుకుంటోంది కేంద్రం. కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచుకుంటూ పోయింది త‌ప్పితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్క రూపాయి కూడా వ్యాట్ పెంచ‌లేదు.
చ‌మురుపై కేంద్రం ధ‌ర పెంపున‌కు కార‌ణ‌మైన వాళ్ల‌ను నిల‌దీస్తాం. చ‌మురుపై కేంద్రం విధిస్తున్న సెస్‌న ర‌ద్దు చేయాలి.“ అని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.