సిఎం జ‌గ‌న్‌ను క‌లిసిన బిసి సంఘాల ప్ర‌తినిధులు..

అమరావతి(CLiC2NEWS) : ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను బిసి సంఘాల ప్ర‌తినిధులు అసెంబ్లీలోని సిఎం కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బిసి జనగణనపై శాసనసభలో తీర్మానం చేసిన సందర్భంగా సిఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. త‌ద‌నంత‌రం సిఎంను స‌త్క‌రించారు. రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకరరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్ టి.ఆంజనేయులు, బిసి సంక్షేమ సంఘం కోశాధికారి కన్నా మాష్టారు, రాష్ట్ర బిసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.హనుమంతరావు, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.క్రాంతి కుమార్ త‌దిత‌రులు సిఎంను క‌లిశారు.

Leave A Reply

Your email address will not be published.