దేశంలో కొత్తగా 10,549 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు మళ్లీ 10 వేలు దాటాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 10,549 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా శుక్రవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 3,45,55,431కి పెరిగాయి.
ఇప్పటి వరకు 3,39,77,830 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా మహమ్మారి వల్ల 4,67,468 మంది మృతిచెందారు.
ప్రస్తుతం దేశంలో 1,10,133 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశంలో గత 24 గంటల్లో 488 మంది మృతిచెందారు.
కొత్తగా దేశంలో 9868 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.