ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కన్నుమూత
హైదరాబాద్(CLiC2NEWS): ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన 800లకు పైగా చిత్రాల్లో పాటలకు నృత్యాలు సమకూర్చారు. కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాకుండా నటుడిగా వెండితేపైనా తనదైన ముద్ర వేవారు. కొన్ని రోజుల క్రితం శివశంకర్ మాస్టర్ కుటుంబం కరోనా బారిన పడింది. మాస్టారు కరోనా చికిత్స నిమిత్తం ఎఐజి ఆస్పత్రిలో చేరారు. ఆయన ఊపిరితిత్తులకు 75% ఇన్ఫెక్షన్ సోకడంతో ఆరోగ్యపరిస్థితి విషమంగా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వడానికి సోనూసూద్, చిరంజీవి, ధనుష్‌లు తమవంతు సాయం చేసిన విషయం తెలిసినదే.