‘త‌ల్లిదండ్రులెవ‌రూ’ భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు: మంత్రిసబితా

హైద‌రాబాద్‌(CLiC2NEWS): క‌రోనా విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పాఠ‌శాల‌ల్లో కొవిడ్ కేసులు న‌మోద‌వుతున్న సంద‌ర్భంగా మంత్రి సోమవారం విద్యాశాఖ అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. విద్యా సంస్థ‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నింధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఆదేశించారు. భౌతిక దూరం, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించే విషయంలో త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం లో క‌రోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ను ఏవిధంగా ఎదుర్కోవ‌డం, టీకా ప్రక్రి‌య‌ను మ‌రింత వేగ‌వంతం చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సిఎం కెసిఆర్  చ‌ర్చించార‌‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.