అమరావతి రైతుల 39వ రోజు పాద యాత్ర.. 60 లక్షల విరాళమిచ్చిన కర్ణాటక రైతులు
అమరావతి(CLiC2NEWS): రైతుల పాదయాత్ర శ్రీకాళహస్తిలో జోరువానను సైతం లెక్క చేయకుండా కొనసాగింది. ఈరోజు పాదయాత్ర శ్రీకాళహస్తి నుండి ప్రారంభమయింది. కర్ణాటకలోని ప్రవాసాంధ్రులు , అమరావతి రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాపాదయాత్రకు మద్దతు పలికి రూ.60లక్షల విరాళం అందజేశారు. పుట్టిన గడ్డకు తోచిన సాహాయం చేసేందుకు వచ్చామని, రైతుల పోరాటం గెలవాలన్నదే సాటి రైతులుగా మా ఆకాంక్ష అని పేర్కొన్నారు.
