సాయితేజ కుటుంబానికి అండగా మంచు విష్ణు
హైదరాబాద్(CLiC2NEWS): ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన నాయక్ సాయితేజ కుటుంబానికి మంచు మోహన్ బాబు కుటుంబం అండగా నిలిచింది. గరువారం మంచు విష్ణు సాయితేజ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. సాయితేజ ఇద్దరు పిల్లలను ఎల్‌కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామని హీరో మంచు విష్ణు వెల్లడించారు. తమిళనాడు వెల్లింగ్టన్ లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత సిడిఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది మృతి చెందారు. బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటి ఆఫీసర్‌గా ఉన్న సాయితేజ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు.
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి