‘నాన్నే నా హీరో’.. నేనూ పైల‌ట్ అవుతా!

ఆగ్ర(CLiC2NEWS) : ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందిన వింగ్‌ క‌మాండ‌ర్ పృథ్వీసింగ్ చౌహాన్ అంత్య‌క్రియ‌లు ఆగ్రాలోని తాజ్‌గంజ్ శ్మ‌శానవాటిక‌లో నిర్వ‌హించారు. ‌త‌మిళ‌నాడులో జ‌రిగిన ఆర్మీ హెలికాప్ట‌ర్ ఘ‌ట‌న‌లో బిపిన్ రావ‌త్ దంప‌తుల‌తో పాటు 11 మంది సైనికాధికారుల మృతి చెందిన విష‌యం తెలిసిన‌దే. పృథ్వీసింగ్ చౌహాన్ పార్థివదేహానికి కుటుంబ స‌భ్యులు స‌మ‌క్షంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఆయ‌న‌కు 12 ఏళ్ల కుమార్తె, 7ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఆయ‌న కుమార్తె మాట్లాడుతూ.. నాన్నే నా హీరో. ఆయ‌న అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తా. నేనూ వాయుసేన‌లో చేరి పైల‌ట్ కావాల‌నుకుంటున్నా అని చెప్పారు. త‌న తండ్రి ఎప్పుడూ చ‌దువు మార్క‌ల కోసం కాద‌ని, చ‌దువుపై దృష్టి పెడితే మార్కులు వాటంత‌ట అవే వ‌స్తాయ‌ని చెప్పేవార‌ని గుర్తుచేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.