కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షలు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి వలన మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడిమి రూ. 2లక్షల ఆర్ధిక సాయం అందించింది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి 65 మంది కుటుంబాలకు రూ. 2 లక్షల చెక్కులను లను అందజేశారు. అదేవిధంగా 40 మంది సాధారణంగా మృతి చెందిన కుటుంబాలకు సైతం లక్ష రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉంటూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఆర్ధిక భరోసా కల్పిస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ రాష్ట్ర మీడియా అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.