ఈనెల 28న రైతుబంధు నిధులు విడుదల
త్వరలో దళితబంధు నిధులు
హైదరాబాద్(CLiC2NEWS): ఈనెల 28వ తేదీ నుండి రైతుబంధు పంట సాయం పంపిణీ నగదును రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఈరోజు తెలంగాణ ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్లర్‌లతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశమయ్యారు. ఈసమావేశంలో రైతుబంధు, దళితబంధు తదితర అంశాల గురించి అధికారులతో చర్చించారు. గతంలో మాదిరిగానే అందరికీ పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
దళితబంధుకు సంబంధించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని సిఎం స్పష్టంచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా వివక్షకు గురువతున్న దళిత సమాజం ఆత్మగౌరంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు.