సిద్దిపేట సీడ్‌హ‌బ్‌గా మార‌నుంది: మ‌ంత్రి హ‌రీశ్‌రావు

సిద్ధిపేట (CLiC2NEWS):  జిల్లాలో రాష్ట్ర విత్త‌న ధృవీక‌ర‌ణ సంస్థ భ‌వ‌నానికి, విత్త‌న గోదాము నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు భూమిపూజ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విత్త‌నోత్ప‌త్తికి సిద్దిపేట జిల్లా అనుకూలంగా ఉంద‌ని, త్వ‌ర‌లో సిద్దిపేట సీడ్‌హ‌బ్‌గా మార‌నుంద‌ని అన్నారు. కేంద్రం వ్య‌వ‌సాయ మార్కెట్ల‌ను న‌ర్వీర్యం చేసింద‌న్నారు. ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్రం ద్వంద్వ వైఖ‌రి అవ‌లంబిస్తోందని, దీనిని రైతుల‌కు ఆర్థ‌మ‌య్యేలా చెప్పాల‌న్నారు. డిమాండ్ ఉన్న వాణిజ్య పంట‌ల‌ను రైతులు సాగుచేయాలి. తెలంగాణ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో సీడ్ కార్పొరేష‌న్‌కు కార్యాల‌యాలున్నాయి. సిద్ధిపేట ఆర‌వ కార్యాల‌యం అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.