దేశంలోని 10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..
ఢిల్లి (CLiC2NEWS): దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నవి. ఇప్పటివరకు దేశంలో 17 రాష్ట్రాలలో 415 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. పండుగల సమయంలో ఆంక్షలు విధించమని, అవసరమైతే నైట్ కర్ఫ్యూలన పెట్లాలని రాష్ట్రాలకు సూచన చేసిన విషయం తెలిసినదే.. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి బృందాలను రాష్ట్రాలకు పంపించాలని నిర్ణయించింది. కేరళ, మహోరాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరం, కర్ణాటక, బిమార్, ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లనున్నాయి. కరోనా నిర్థారణ పరీక్షలు, కరోనా నింధనల అమలు వంటి విషయాలపై రాష్ట్ర అధికారులతో కలసి పనిచేయనున్నారు. రాష్ట్రాలలో వ్యాక్సినేషన్ వృద్ధి, ఆసుపత్రల్లోని సౌకర్యాలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యత తదితర అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదించనున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.