ధరణిలో ఒకటి కంటే ఎక్కవ ఉన్న ఖాతాలు విలీనం..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఒకటికంటే ఎక్కవ ఖాతాలు ఉన్న రైతులకు వాటిని విలీనం చేసే అవకాశం కల్పించింది. గతంలో రైతులు ఏ ప్రాంతంలో భూములు ఉంటే.. అక్కడ ఖాతాలను మంజూరు చేశారు. ఆ ఖాతాలన్నిటి విలీనానికి అవకాశం కల్పించాలని రైతులు కోరగా.. విలీనానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ‘అప్లికేషన్ ఫర్ ఖాతా మెర్జింగ్’ అనే పేరుతో మాడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ‘న్యూ రిక్వెస్ట్’ అనే ఆప్షన్ ను ఎంచుకొని, ఏయే సర్వే నంబర్లలో ఉన్న ఖాతాలను విలీనం చేయాలో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇఅ నమోదు చేసినవి నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్తాయని తెలియజేశారు.