మహిళా కండక్టర్ల విధులు రాత్రి 8 గంటల వరకే..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరేలా డ్యూటీలు వేయాలని ఆర్టిసి ఎండి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. డ్యూటీ సమాయాలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ పలువురు మహిలా కండక్టర్ల ఫిర్యాదుతో.. వారి విధుల సమయాలు మారుస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలు చేయాలని పేర్కొన్నారు.