Hyderabad: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మ‌హ‌త్య‌..

సంగారెడ్డి (CLiC2NEWS): జిల్లాలోని అమీన్‌పూన్ పోలీసు స్టేష‌న్ ప‌ర‌ధిలో ఓ సాఫ్ట్‌వేర్ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వంద‌న‌పురి కాల‌నీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీ‌కాంత్ గౌడ్ భార్య అనామిక నివాస‌ముంటున్నారు. వీరికి ఏడేండ్ల చిన్నారి కూడా ఉంది. రెండ్రోజులుగా క‌నిపించ‌టంలేద‌ని అనామిక తండ్రి ఇచ్చిన‌ ఫిర్యాదు మేర‌కు పోలీసులు అనుమానంతో ఇంటి త‌లుపులు తెరిచి చూడ‌గా చిన్నారితో క‌లిసి త‌ల్లి మంచంపై విగ‌త‌జీవులుగా క‌నిపించారు. తండ్రి ఉరి వేసుకొని అత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.